‘సాహో’ లొ భారీ విజువల్ ఎఫెక్ట్స్..!

0
27

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటిస్తున్న సినిమా ‘సాహో’. ‘రన్ రాజా రన్’ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలివుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తొంది. ‘సాహో’లో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నయని తెలుస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలో లేనన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు సుజీత్ చెబుతున్నారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా హాలివుడ్ రేంజ్ లో ఉంటుందట. యువి క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు సంగీత త్రయం శంకర్ ఎహ్సాన్ లాయ్ లు సంగీతం అందిస్తున్నారు.భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్ట్ 15 న విడుదల చేయనున్నారు.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20 వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here