ప్రధాని మోడీ పాత్రలో ‘వినయ విధేయ రామ’ విలన్..!

0
23

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర నటులు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పెర్సన్స్ జీవిత కధల ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. సిల్క్ స్మిత, సావిత్రి, మేరీ కోమ్ ల బయోపిక్ లు ఘన విజయం సాదించగా మరికొన్ని బయోపిక్ లు విడుదల కానున్నాయి.

ఈ నేపధ్యంలో మరో రాజకీయనాయకుడి బయోపిక్ ను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు దర్శకుడు ఒమంగ్ కుమార్. భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ను ఆయన రూపొందించనున్నారు. ఇంతకు ముందు ఈ దర్శకుడు ‘సరబ్జిత్’, ‘మేరీ కోమ్’ బయోపిక్ లను తెరకెక్కించాడు.

ఇక మోడీ బయోపిక్ లో ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించనున్నాడు. వివేక్ వినయ విధేయ రామ లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జూన్ 11 న విడుదల కానుంది. మోడీ బయోపిక్ షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్దంలో ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here