వెంకటేష్ త్రివిక్రం ల సినిమా కన్ఫర్మ్..!

0
29

విక్టరీ హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మల్టి స్టారర్ గా రూపుదిద్దుకున్న సినిమా ‘ఎఫ్ 2’ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది. సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా తరువాత కూడా వెంకీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

‘జై లవకుశ’ దర్శకుడు బాబీ డైరెక్షన్లో నాగచైతన్య తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టి స్టారర్ లో నటిస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా త్వరలొ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా తరువాత వెంకీ మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇవి కాకుండా అనిల్ రావిపూడి మరి కొంతమంది దర్శకులు వెంకీ కోసం స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదల కనున్న ‘ఎఫ్ 2’ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘ఎఫ్ 2’ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు కు కూడా ఈ సినిమా కీలకం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here