చైతు కోసం స్టార్ రైటర్ కధ..!

0
27

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య హిట్ కోసం చూస్తున్నాడు. చైతు కు ఒక మంచి లవ్ స్టోరీ రాస్తున్నా అని స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ పాత ‘దేవదాసు’ కధ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కధను చైతు కోసం రాసాడట.

ఈ సినిమా చైతు కెరీర్ లోనే గొప్ప సినిమా నిలిచి పోతుందని ఈ స్టార్ రైటర్ అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్లాపుల హీరోగా మారుతున్న చైతు కు ఒక మంచి సినిమా అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ స్క్రిప్ట్ రాసారట విజయేంద్ర ప్రసాద్.

ప్రస్తుతం నాగచైతన్య శివ నిర్వాణ దర్శకత్వంలో సతీమణి సమంతా తో కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గతంలో శివ నిర్వాణ ‘నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్ మూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here