వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో చంద్రబాబు ఇతనే..!

0
29

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ విడుదలయి, అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న దశలో వర్మ తన సినిమా నుంచి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు వివాదాస్పద పాటలను విడుదల చేసిన వర్మ తాజాగా చంద్రబాబు పాత్ర లో శ్రీతేజ్ నటిస్తున్నరని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం.

శ్రీతేజ్ గతంలో ‘వంగవీటి’ సినిమాలో దేవినేని నెహ్రూ పాత్రను పోషించారు. ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ లో కూడా శ్రీతేజ్ నటించారు. ఈ సినిమాలో అతను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించారు.

శ్రీతేజ్ కు తనదైన స్టైల్ లో మేకొవర్ ఇచ్చి చంద్రబాబు దగ్గరి పోలికలు తీసుకు రాగలిగాడు. ఇక ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో వీరప్పన్ భార్య గా నటించిన యఙా శెట్టిని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో లక్ష్మీ పార్వతి గా చూపించబోతున్నాడు వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here