లోగో విడుదల చేసిన ‘రావే నా చెలియా’..!

0
27

నూతన నటీ నటులతో ఎన్ మహేశ్వర రెడ్డి రూపొందించిన సినిమా ‘రావే నా చెలియా’. నెమలి అనిల్, సుబాంగి పంథ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాను సూర్య చంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నెమలి అనిల్, నెమలి శ్రావణ్ లు నిర్మిస్తున్నారు. నెమలి సురేష్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా లోగో ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రావే నా చెలియా’ టైటిలే అట్ట్రాక్టివ్ గా ఉంది. కంటెంట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నా. ఎంటైర్ టీమ్ కు నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా అని అన్నారు.

దర్శకుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాతలు మరియు హీరో అనిల్ నన్ను నమ్మి చాలా సపోర్ట్ చేసారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం:ఎమ్ ఎమ్ కుమార్, కెమెరా: విజయ్ దగ్గుబాటి, ఎడిటర్: రవి మాన్ల, నిర్మాతలు: నెమలి అనిల్, నెమలి శ్రవణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్. మహేశ్వర రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here