బ్లాక్ బస్టర్ దర్శకుడితో చాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..!

0
27

టాలివుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తయరయింది పూజా హెగ్డే. బన్నీ సరసన ‘డీజె’, ఎన్టీఆర్ కు జోడీగా ‘అరవింద సమేత’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుందీ అమ్మడు. పూజా కు తెలుగులోనే కాకుండా బాలివుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఏకంగా హృతిక్ రోషన్ సినిమాతో బాలివుడ్ లోకి అడుగుపెట్టింది.

‘మొహంజదారో’ సినిమాలో హృతిక్ కు జోడీగా నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా తన లుక్స్ తో బాలివుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది పూజా. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘మహర్షి’ సినిమాలొ నటిస్తుండగా, ప్రభాస్ సరసన మరో సినిమాలో చాన్స్ కొట్టేసింది.

ప్రస్తుతం బాలివుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ లో నటిస్తోంది పూజా హెగ్డె. ఈ సినిమాతో బాలివుడ్ లో హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె చేతికి బంపర్ ఆఫర్ వచ్చింది. ‘సింబా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రోహిత్ శెట్టి తన తరువాతి సినిమాలో పూజా ను హీరోయిన్ గా ఎంపిక చేసాడు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరో. ఇప్పటి పరిస్థితుల్లో రొహిత్ శెట్టి సినిమాల్లో చాన్స్ అంటే అది జాక్ పాట్ కిందే లెక్క. మరి ఈ సినిమా సక్సెస్ అయితే పూజా టాలివుడ్, బాలివుడ్ లలో ఏది ఎంచుకుంటుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here