మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కీర్తి సురేష్..!

0
13

‘నేను శైలజ’ సినిమాతో టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘మహానటి’ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు కీర్తి సురేష్. ‘నేను శైలజ’ లొ రామ్ సరసన నటించిన కీర్తి సురేష్, ఆ తరువాత నాని సరసన ‘నేను లోకల్’ సినిమాలో కూడా నటించారు. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాదించాయి. అయితే ‘మహానటి’ లో సావిత్రి పాత్ర ఆమెకు ఎంతో పేరు తీసుకు వచ్చింది. ఆమె నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది.

‘మహానటి’ తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అయితే ఏ సినిమాలో కూడా నటించేందుకు ఒప్పుకోలేదు. ‘మహానటి’ కి ముందు ఆమె ఎన్నో తమిళ చిత్రాల్లో కూడా నటించారు. తాజాగా ఒక దర్శకుడు ఒక లేడీ ఒరియెంటెడ్ కధతో కీర్తి ని ఒప్పించి సైన్ చేయించాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెల్లనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here