‘బాహుబలి’ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్న మణిరత్నం..!

0
28

‘బాహుబలి’..ప్రపంచవ్యాప్తంగా కలక్షన్ల వర్షం కురిపించింది. టాలివుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి రెండు పార్టులుగా విడుదలయి ఘన విజయం సొంత చేసుకుంది. దక్షిణాది బాషలతో పాటు బాలివుడ్ లోనూ రికార్డులను సృష్టించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

ఇప్పుడు దక్షిణాదిలో ఆ రేంజ్ పీరియాడికల్ మూవీ కి రంగం సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ సారి ఆ భారీ సినిమాను తెరకెక్కించనున్నారు. తమిళం తో పాటు తెలుగులో రూపొందనున్న ఈ సినిమాలో బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తారు. ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా నటించనున్నరు.

ఈ భారీ బడ్జెట్ సినిమాను కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆదారంగా తెరకెక్కించనున్నారు. ఈ నవల ఐదు పార్టులుగా ఉండగా, సినిమాను మూడు పార్టులుగా తీయాలని ప్లాన్ చేస్తున్నరు. ఈ సినిమా కోసం మొత్తం రెండున్నర సంవత్సరాల సమయం పడుతుందని మణిరత్నం భావిస్తున్నారట. టాలివుడ్, కోలీవుడ్ లోని ప్రముఖ స్టార్స్ ఈ సినిమాలో నటించనున్నారని సమాచారం.

ఈ సినిమా గురించి సంక్రాంతికి మణిరత్నం అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ‘బాహుబలి’ రేంజ్ లో మరో సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకుడు మణిరత్నం. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here