ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు చుక్కలు చూపించిన బోయపాటి..!

0
11

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ జనవరి 12 న విడుదలయి డివైడ్ టాక్ తో నడుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

గత సంవత్సరం విడుదలయిన ‘రంగస్థలం’ సినిమా ఘన విజయం సాదించడంతో ఈ సినిమా కు ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో ఈ సినిమాను రూ 9 కోట్లకు అమ్మారు.

డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కల్క్షన్స్ రూ 26 కోట్లు గ్రాస్ కలక్ట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దీనికి విరుద్దంగా ఓవర్సీస్ లో కేవలం రూ 17 లక్షలు వసూలు చేసి డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో ప్రీమియర్ షోస్ కలక్షన్స్ ఇంకా తెలియ రాలేదు. టోటల్ రన్ లో కేవలం హాఫ్ మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ 3 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు బాగా నష్టం వస్తుందని తలలు పట్టుకుంటున్నారు. బోయపాటి దెబ్బకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు విలవిలలాడ్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here