విడుదలకు సిద్దమయిన ‘బైలంపుడి’..!

0
28

అందరూ కొత్త నటీ నటులతో తెరకెక్కుతున్న చిత్రం ‘బైలంపుడి’. అనిల్ పిజి రాజ్ దర్శకుడు. హరీష్ వినయ్ , తనిష్క తివారి హీరో హీరోయిన్లుగా నటించారు. తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానంద రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. గ్రామీణ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ ను బాలివుడ్ నటి మైరా అమిథి చేతుల మీదుగా విడుదల చేసారు. అనంతరం మైరా మాట్లాడుతూ పిల్లలు దేవుడు పల్లవి తో సాగే సాంగ్ చాలా బాగుంది. అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు.

నిర్మాత బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తగా ఉన్న నేను సినిమాల మీద ఆసక్తితో మొదటిసారి ఈ సినిమాను నిర్మిస్తున్నాను. అందరూ కొత్తవాళ్ళతో నిర్మించిన ఈ సినిమా, హై టెక్నికల్ వాల్యూస్ తో చాలా బాగా వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక్క‌డ యుద్ధం చేయాలి…గెల‌వ‌డానికి కాదు, బతకడానికి“ అనేది మా సినిమా క్యాప్ష‌న్. ‘పిల్ల‌ల దేవుడు’ అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశాం. అంద‌రికీ పాట న‌చ్చుతుంద‌న్న నమ్మ‌కం ఉంది“ అన్నారు.

హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందించారు. సుభాష్ గారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు అని అన్నారు. దర్శకుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ దర్శకుడిగా నాకిది తొలి సినిమా. బైలంపుడి అనే గ్రామంలో జ‌రిగే ల‌వ్ అండ్ పొలిటిక‌ల్ చిత్ర‌మిది. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జ సిద్ధంగా ఉంటుంది. మా సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here