సంక్రాంతి కానుకగా ‘జెర్సీ’ టీజర్..!

0
23

సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు నాచురల్ స్టార్ నాని. తాజాగా క్రికెట్ నేపధ్యంలో ‘జెర్సీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘మళ్ళీ రావా’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. నాని మొదటిసారి క్రికెటర్ గా నటిస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయనున్నారు. నాని సరసన కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాద్ నటిస్తున్నారు.

స్పోర్ట్స్‌మెన్ కధల నేపధ్యంలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు ఘన విజయం సాదించాయి. మరి క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ గా వస్తున్న ‘జెర్సీ’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రంజీ క్రికెటర్ కధను ఆదారంగా చేసుకొని రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఏప్రియల్ 19 న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here