‘మున్నాభాయ్’ సీరీస్ లో రానున్న ‘మున్నాభాయ్ 3’..!

0
28

భారతీయ చిత్ర పరిశ్రమలో మేటి దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన మున్నాభాయ్ సీరీస్ సినిమాలు ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’ లు ఘన విజయం సాదించాయి. మున్నాభాయ్ గా ప్రముఖ నటుడు సంజయ్ దత్ నటించారు. ఈ సినిమాలు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తో రీమేక్ చేసారు. ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ గా ఈ సినిమాలు విడుదలవగా ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ సీరీస్ లో ‘మున్నాభాయ్ 3’ కూడా రానుంది. మున్నాభాయ్ మొదటి రెండు సినిమాల్లో నటించిన అర్షద్ వార్సి ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిఫ్త్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించనుందని సమాచారం. మరి ఈ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here