బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘వినయ విధేయ రామ’ మొదటి రోజు కలక్షన్స్..!

0
29

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ భారీ అంచనాల మధ్య నిన్న విడుదలయింది. ఈ సినిమాకు టాక్, రీవ్యూస్ రెండూ నెగటివ్ గా వచ్చినప్పటికీ కలక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించింది. మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ 26 కోట్లు షేర్ రాబట్టి షాక్ ఇచ్చింది. టాలివుడ్ లో ‘బాహుబలి’, ‘అఙాతవాసి’ సినిమాల తరువాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

అంతే కాకుండా సీడెడ్ ఏరియాలొ లో బాహుబలి రికార్డును బద్దలగొట్టింది. అక్కడ బాహుబలి రూ 6 కోట్ల షేర్ రాబట్టగా ఈ సినిమా రూ 7.2 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాకు సంక్రాంతి సెలవుల రూపంలో కలిసి రానుంది. మరి రాబోయే రోజుల్లొ కూడా ఈ కలక్షన్ల పరంపర కొనసాగిస్తుందో లేదో చూడాలి.

ఏపి తెలంగాణాల్లో మొదటి రోజు ఏరియా వైజ్ గా కలక్షన్ల వివరాలు..

నైజాం – 5.08 కోట్లు
సీడెడ్ – 7.02 కోట్లు
నెల్లూరు – 1.69 కోట్లు
గుంటూరు – 4.18 కోట్లు
కృష్ణా – 1.58 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.83 కోట్లు
తూర్పు గోదావరి – 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.45 కోట్లు
ఏపి తెలంగాణ మొదటి రోజు షేర్ – 26.07 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here