జనవరి 14 న ‘దేవ్’ ఆడియో విడుదల..!

0
24

తమిళ స్టార్ హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘దేవ్’. ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకుడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 14 న సంక్రాంతి సందర్భంగా జరుపనున్నామని చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమాలో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్, నిక్కి గల్రాని హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది ‘దేవ్’. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. మధు సమర్పిస్తున్న ఈ సినిమాను లక్ష్మణ్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here