#RRR లో ఎన్టీఆర్ రామ్ చరణ్ సరసన బాలివుడ్ హీరోయిన్లు..?

0
15

టాలివుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఒక మల్టి స్టారర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ ఫిబ్రవరి లో ఉంటుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే నటించే హీరోయిన్లను ఎంపిక చేసారట. ఆ ఇద్దరు హీరోయిన్లు బాలివుడ్ వారని సమాచారం. ఇంకా మరికొంతమంది దక్షిణాది నటులను కూడా ఎంపిక చేసారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలోని హీరోయిన్ల పేర్లు వెళ్ళడిస్తారట.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను డివివి దానయ్య, డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2020 లో తెలుగు తో పాటు, తమిళం, మళయాళం, హిందీ బాషల్లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here