విజయ్ దేవరకొండ సరసన లేడీ ఎమ్మెల్యే..!

0
27

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అమాంతం క్రేజ్ పెరిగిన హీరో విజయ్ దేవరకొండ. గత సంవత్సరం విడుదలయిన ‘గీత గోవిందం’ కూడా విజయ్ క్రేజ్ ను పెంచిందనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సెన్సిబుల్ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ ను ఫిక్స్ చెసారు.

అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాలో లేడీ ఎమ్మెల్యే గా నటించిన కేథరీన్ ను ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఎంపిక చెసారు. కేథరీన్ కు అందం అభినయం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత తెలుగులో మరే సినిమా చేయలేదు కేథరీన్. తమిళం హిందీ ల్లో అడపా దడపా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమెకు స్టార్‌డమ్ దక్కడం లేదు. విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, అతని తో నటిస్తే కేథరీన్ దశ తిరగొచ్చు అని భావిస్తున్నారు సినీ జనం.

విజయ్ దేవరకొండ తో నటించిన రష్మిక మందన్నా రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. విజయ్ కు ఉన్న క్రేజ్ వలన కేథరీన్ క్రేజ్ కూడా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here