రవిబాబు నెక్ష్ట్ ‘ఆవిరి’..!

0
40

రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు, ప్రయోగాత్మక చలన చిత్రాల దర్శకుడు రవి బాబు మొదటి సినిమా ‘అల్లరి’. ఆ తరువాత ‘అనసూయ’ వంటి థ్రిల్లర్ ను అందించి ఘన విజయం సాదించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తాజాగా పందిపిల్లను హీరోగా పెట్టి రూపొందించిన ‘అదుగో’ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది..

ప్రస్తుతం రవిబాబు మరొ వెరైటీ కాన్సెప్ట్ తో ‘ఆవిరి’ అనే సినిమా ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేసాడు. ఒక గ్లాస్ జార్ లొ స్లీవ్ లెస్ బ్లాక్ డ్రెస్ తో ఒకమ్మాయి డ్యాన్స్ మూమెంట్ లో ఉండగా పెద్ద గోర్లు ఉన్న మరో అమ్మాయి చేయి ఆ గ్లాస్ జార్ మూతను ఓపెన్ చెస్తోందీ పోస్టర్ లో. పోస్టర్ చూస్తుంటే ఇది కూడా వెరైటీ సినిమా అని తెలుస్తోంది. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నటీ నటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. మరి రవిబాబు ఈ సినిమా తోనైనా హిట్ కొడతారో లేదో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here