విడుదలకు సిద్దమయిన ‘ప్రణవం’..!

0
32

చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఈ రోజుల్లో’ ఫేమ్ శ్రీమంగం, శశాంక్, అవంతి హరి నల్వా, గాయత్రి అయార్ లు నటిస్తున్న చిత్రం ‘ప్రణవం’. భరత నాట్యం నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకుడు కుమార్ జి. తను ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు కుమార్ జి మాట్లాడుతూ భరత నాట్యం నేపధ్యంలో లవ్ సస్పెన్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నం. చండీఘడ్ కు చెందిన మోడల్ అవంతి హరి నల్వా హీరోయిన్ గా నటీస్తుండగా, గాయత్రి అయ్యర్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణ అని ప్రముఖ సంగీత దర్శకుడూ గాయకుడు ఆర్ పి పట్నాయక్, ఉష కలిసి ఒక పాటను పాడారని చెప్పారు. త్వరలో ఆడియో రిలీజ్ చేస్తాం అని అన్నారు.

జెమిని సురేష్‌, నవీన, జబర్దస్త్‌ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పద్మనావ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here