‘కేజీఎఫ్ 2’ లో సంజయ్ దత్ రమ్యకృష్ణ..!

0
30

‘కేజీఎఫ్’..కన్నడ సినిమాగా రూపొంది ఐదు బాషల్లో విడుదలయి సంచలన విజయం నమోదు చేసుకుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘కేజీఎఫ్’ సీక్వెల్ రూపొందించడానికి రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం సీక్వెల్ కు సంబందించి ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిర్గందూర్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సీక్వెల్ లో బాలివుడ్ నటుడు సంజయ దత్, ప్రముఖ నటి రమ్య కృష్ణ నటిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో గాని వీరిద్దరు నటిస్తే మాత్రం ఈ సినిమా దక్షిణాదిలోనే కాకుండా బాలివుడ్ లో కూడా ఈ సినిమా క్రేజ్ విపరీతంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here