జనవరి 25 న ‘మిస్టర్ మజ్ఞు’ విడుదల..!

0
28

అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటివరకూ నటించిన రెండు సినిమాలు అపజయం పాలయ్యాయి. తాజాగా ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ఞు’ అనే సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ నిన్న పూర్తయింది.


యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అఖిల్ ప్లే బాయ్ గా నటిస్తున్నాడు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్విసిసి పతాకంపై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 25 న విడుదల కానుంది.

‘అఖిల్’, ‘హలో’ సినిమాలతో పూర్తి స్థాయి విజయాలను అందుకోలేకపొయిన అఖిల్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చూద్దాం మరి సినిమా రిజల్ట్ ఏమిటో. తన తరువాతి సినిమాను అఖిల్ త్వరలో ప్రకటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here